Company Brand Names: బ్రాండ్ నేమ్స్ పై టీఎం, ఆర్ అనే అక్షరాలకు అర్థమేంటి?
మంచి నాణ్యతకు ఫలానా కంపెనీ వస్తువులు బాగుంటాయి, ఇంకొన్ని వస్తువులను మరో కంపెనీ బాగా ఉత్పత్తి చేస్తుంది అనే మాటలు మనకు తరచుగా వినిపిస్తుంటాయి. నాణ్యత అనగానే గుర్తొచ్చేది బ్రాండ్. మనలో కూడా చాలా మంది ఈ బ్రాండ్‌ను బట్టే వస్తువులు కొనుగోలు చేస్తుంటారు కూడా. ఇక బ్రాండ్ పేరు అనేది నిర్దిష్ట కంపెనీని, ఉత్పత్తిని, సేవను గుర్తిస్తుంది. అదే వర్గానికి చెందిన సారూప్య బ్రాండ్‌ల నుండి వేరుచేసే ప్రత్యేకమైన పదం. అయితే, కొన్ని కంపెనీలు తమ బ్రాండ్ల పేర్ల పక్కన టీఎం, ఆర్ అనే అక్షరాలను పెట్టడం మనకు కనిపిస్తుంటుంది. అసలు వాటికి అర్థం ఏంటి? ఎందుకు ఆ అక్షరాలను పెట్టడం జరుగుతుంది? వాటివల్ల ఆయా కంపెనీలకు కలిగే లాభం ఏంటి? తదితర వివరాలను మనం ఈ కింది వీడియో ద్వారా తెలుసుకుందాం.