West Indies vs England: దంచికొట్టిన సాల్ట్.. విండీస్‌పై ఇంగ్లండ్ సునాయాస విజయం!
- సూపర్-8లో తలపడిన వెస్టిండీస్, ఇంగ్లండ్
- 180 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలోనే ఛేదించిన ఇంగ్లండ్
- ఓపెనర్ ఫీల్ సాల్ట్ వీరవిహారం
- 47 బంతుల్లోనే 5 సిక్సర్లు, 7 బౌండరీల సాయంతో అజేయంగా 87 రన్స్
టీ20 ప్రపంచకప్‌లో లో భాగంగా వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో సూపర్-8 మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఇంగ్లిష్ జట్టు సునాయాసంగా ఛేదించింది. మొదట విండీస్ జట్టు 180 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ కేవలం 17.3 ఓవర్లలోనే టార్గెట్‌ను అందుకుంది. ఓపెనర్ ఫీల్ సాల్ట్ వీరవిహారం చేశాడు.
కేవలం 47 బంతుల్లోనే 5 సిక్సర్లు, 7 బౌండరీల సాయంతో అజేయంగా 87 పరుగులు చేశాడు. అలాగే జానీ బెయిర్‌స్టో కూడా బ్యాట్ ఝుళిపించాడు. 26 బంతుల్లోనే 48 రన్స్ తీశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఈ జోడి 44 బంతుల్లో అజేయంగా 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం.
ఒకే ఓవర్లో 4,6,4,6,6,4
ఇక ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 16వ ఓవర్ చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఈ ఓవర్లో ఫీల్ సాల్ట్ ఊచకోత కోశాడు. రొమారియో షెఫర్డ్ వేసిన 16వ ఓవర్లో వరుసగా 4,6,4,6,6,4తో ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు సాల్ట్.