Adinarayana Reddy: చెల్లి వల్లే నష్టపోయానని జగన్ తెలుసుకున్నారు... అందుకే...!: ఆదినారాయణరెడ్డి

BJP MLA Adinarayana Reddy comments on YS Family issues
  • ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
  • అసెంబ్లీ లాబీలో అత్యంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే
  • రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్న ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలు
ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనసభ లాబీలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అత్యంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, మిథున్ రెడ్డి లాబీయింగ్ చేస్తున్నారని ఆదినారాయణరెడ్డి వెల్లడించారు. అయితే వైసీపీ ఎంపీలను చేర్చుకునేందుకు బీజేపీ ఇష్టపడడంలేదని అన్నారు. 

ఈ సందర్భంగా ఆయన వైఎస్ కుటుంబ విభేదాలపైనా స్పందించారు. చెల్లి షర్మిల వల్లే నష్టపోయానని జగన్ తెలుసుకున్నారని ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. అందుకే చెల్లితో రాజీ చేయాలని తల్లిని కోరారని వివరించారు. షర్మిల మాత్రం... అన్న కాంగ్రెస్ పార్టీలో చేరాలని షరతు విధించిందని అన్నారు. 

ఓదార్పు యాత్ర కోసం జగన్ కారణాలు వెదుక్కుంటున్నారని ఆదినారాయణరెడ్డి విమర్శించారు. ఏ కారణం దొరక్కపోతే బాధితులను సృష్టించుకుంటారని అన్నారు. 

ఇక, వివేకా హత్య కేసులో త్వరలోనే అవినాశ్ రెడ్డి అరెస్ట్ కావడం తథ్యమని ఆదినారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు. కడప లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక వస్తుందని, టీడీపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డి పోటీ చేసి గెలుస్తారని జోస్యం చెప్పారు.
Adinarayana Reddy
BJP
Jagan
Sharmila
Congress
YSRCP
Mithun Reddy
Andhra Pradesh

More Telugu News