Varalaxmi Sarathkumar: కాబోయే భర్తతో కలిసి అల్లు అర్జున్ కు పెళ్లి కార్డు అందించిన వరలక్ష్మి శరత్ కుమార్

Varalaxmi Sarath Kumar gives Allu Arjun wedding invitation
  • త్వరలో పెళ్లిపీటలు ఎక్కుతున్న వరలక్ష్మి శరత్ కుమార్
  • నికోలాయ్ సచ్ దేవాతో పెళ్లి
  • పెళ్లి కార్డులు పంచుతూ బిజీగా ఉన్న వరలక్ష్మి
  • తాజాగా అల్లు వారి ఇంటికి రాక
ప్రముఖ దక్షిణాది నటి వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ముంబయికి చెందిన ఆంట్రప్రెన్యూర్, ఆర్ట్ ఎగ్జిబిషనిస్ట్ నికోలాయ్ సచ్ దేవాతో జీవితాన్ని పంచుకోనున్నారు. పెళ్లి నేపథ్యంలో, శుభలేఖలు పంచుతూ వరలక్ష్మి శరత్ కుమార్ బిజీగా ఉన్నారు. 

తాజాగా, తన కాబోయే భర్త నికోలాయ్ సచ్ దేవాతో కలిసి టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నివాసానికి విచ్చేశారు. అల్లు అర్జున్ కు కార్డు అందించి, తన వివాహానికి రావాలంటూ ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాబోయే కొత్త జంటకు అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలియజేశారు. అటు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు కూడా వరలక్ష్మి పెళ్లి కార్డు అందించారు.
Varalaxmi Sarathkumar
Allu Arjun
Nicolay Sachdeva
Wedding
Kollywood
Tollywood

More Telugu News