Uttar Pradesh: స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు రాగానే బాలుడి మృతి!

up boy collopses and dies after coming out of swimming pool
  • ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఘటన
  • స్విమ్మింగ్ పూల్ బటయకొచ్చిన మరుక్షణమే కుప్పకూలిన 15 ఏళ్ల బాలుడు
  • ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యుల ప్రకటన
  • ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
ఉత్తరప్రదేశ్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. స్విమ్మింగ్ పూల్‌లో అప్పటివరకూ ఈత కొట్టి బయటకొచ్చిన మరుక్షణమే టీనేజ్ బాలుడు కుప్పకూలి మరణించాడు. మీరట్‌లో వెలుగు చూసిన ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. మృతుడిని శివాల్‌ఖాస్ వాస్తవ్యుడిగా గుర్తించారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, స్విమ్మింగ్ పూల్ బయటకు రాగానే ఆ బాలుడు స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. స్విమ్మింగ్ పూల్ నిర్వాహకుడు పరారీలో ఉండగా ఘటన నేపథ్యంలో అధికారులు దాన్ని మూసేశారు. బాలుడి మృతికి కారణమేంటో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Uttar Pradesh
Crime News

More Telugu News