Quinton de Kock: టీ20 క్రికెట్‌లో క్వింటన్ డి కాక్ అరుదైన రికార్డు.. తొలి వికెట్ కీప‌ర్‌గా ఘ‌న‌త‌!

Quinton de Kock scripts T20I history achieves rare feat for a wicketkeeper

  • దక్షిణాఫ్రికా, విండీస్ మధ్య సూపర్-8 మ్యాచ్ 
  • టీ20ల్లో 100 మందిని ఔట్‌ చేసిన తొలి వికెట్ కీపర్‌గా డి కాక్ చరిత్ర
  • రోవ్‌మన్ పావెల్‌ను స్టంపవుట్‌ చేయడంతో 100 ఔట్ల‌ అరుదైన మైలురాయిని అందుకున్న డి కాక్‌ 
  • వికెట్ కీపర్‌గా 91 ఔట్‌లతో రెండో స్థానం ఎంఎస్‌ ధోనీ

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న‌ సూపర్-8 మ్యాచులో సఫారీ వికెట్ కీప‌ర్ క్వింటన్ డి కాక్ చరిత్ర సృష్టించాడు. అంత‌ర్జాతీయ టీ20ల్లో 100 మందిని ఔట్ చేసిన తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఈ పోరుకు ముందు 99 అవుట్‌లతో ఉన్న డి కాక్.. కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్‌ను స్టంప్ చేయడంతో 100 ఔట్ల‌ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. తన అంత‌ర్జాతీయ‌ టీ20 కెరీర్‌లో వికెట్ కీపర్‌గా 82 క్యాచ్‌లు, 18 స్టంపింగ్ చేశాడు డి కాక్‌.

అంత‌ర్జాతీయ‌ టీ20లలో అత్యధిక అవుట్‌లు చేసిన వికెట్ కీపర్‌ల జాబితాలో భాత‌ర మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీని వెన‌క్కి నెట్టిన డి కాక్ అగ్ర‌స్థానంలో కొనసాగుతున్నాడు. వికెట్ కీపర్‌గా ధోనీ 91 ఔట్‌లతో రెండో స్థానంలో ఉంటే.. కెన్యా వికెట్ కీపర్ ఇర్ఫాన్ అలీ కరీమ్ 83 ఔట్‌లతో జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. 

టీ20ల్లో అత్యధిక ఔట్‌లు చేసిన వికెట్‌ కీపర్‌ల జాబితా ఇదే..
100 - క్వింటన్ డి కాక్ (82 క్యాచ్‌లు, 18 స్టంపింగ్‌లు)
91 - ఎంఎస్ ధోని (57 క్యాచ్‌లు, 34 స్టంపింగ్‌లు)
83 - ఇర్ఫాన్ అలీ కరీమ్ (59 క్యాచ్‌లు, 24 స్టంపింగ్‌లు)
79 - జోస్ బట్లర్ (66 క్యాచ్‌లు, 13 స్టంపింగ్స్)
63 - దినేష్ రామ్‌దిన్ (43 క్యాచ్‌లు, 20 స్టంపింగ్స్)


ఓవరాల్‌గా చూస్తే డి కాక్ 557 ఔట్‌లతో వికెట్ కీపర్ ద్వారా అత్యధిక అవుట్‌లను చేసిన జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. మార్క్ బౌచర్ 998 ఔట్‌లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆడమ్ గిల్‌క్రిస్ట్ (905), ఎంఎస్ ధోని (829), కుమార సంగక్కర (678), ఇయాన్ హీలీ (628) మొదటి ఐదు స్థానాల్లో ఉన్నారు.

  • Loading...

More Telugu News