MVV Satyanarayana: వైసీపీ నేత, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై కేసు నమోదు

Case Filed Against YCP Leader MVV Satyanarayana In Visakha
  • ఎంవోయూ పేరిట ఖాళీ పత్రాలపై తనతో సంతకాలు పెట్టించుకున్నారని బాధితుడి ఫిర్యాదు
  • విలువైన భూములు కాజేసే ప్రయత్నం చేశారని జగదీశ్వరుడు ఆరోపణ
  • కేసు కొట్టివేయాలంటూ హైకోర్టుకు వైసీపీ నేత
వైసీపీ నేత, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతోపాటు ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు, రియల్టర్ గద్దె బ్రహ్మాజీపై విశాఖపట్టణం పోలీసులు కేసు నమోదు చేశారు. హయగ్రీవ కన్‌స్ట్రక్షన్ అధినేత జగదీశ్వరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఎంవోయూ పేరిట ఖాళీ పత్రాలపై ఎంవీవీ తనతో సంతకాలు పెట్టించుకున్నారని, విలువైన భూములను కాజేసే ప్రయత్నం చేశారని జగదీశ్వరుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 22న సత్యనారాయణపై పోలీసులు నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మరోపక్క, తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ సత్యనారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
MVV Satyanarayana
YSRCP
Visakhapatnam
Police Case

More Telugu News