Uddhav Thackeray: ఫడ్నవీస్‌తో మాటామంతిపై ఉద్ధవ్ ఠాక్రే ఆసక్తికర వ్యాఖ్య

Uddhav Thackeray interesting comments on meeting with Fadnavis
  • లిఫ్ట్ వద్ద ఎదురుపడిన ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే
  • ఒకరినొకరు పలకరించుకున్న వైనం 
  • తాము అనుకోకుండా కలిశామన్న ఠాక్రే
  • రహస్య సమావేశాలు లిఫ్ట్‌లోనే పెట్టుకుంటామని సరదా వ్యాఖ్య
మహారాష్ట్రలో రాజకీయ ప్రత్యర్థులు ఉద్ధవ్ ఠాక్రే, దేవేంద్ర ఫడ్నవీస్ ఎదురుపడ్డారు. మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వీరిద్దరు లిఫ్ట్ కోసం ఎదురుచూస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సమయంలో వీరిద్దరు ఒకరినొకరు పలకరించుకున్నారు. అయితే వారు ఏ విషయం గురించి చర్చించుకున్నారో తెలియరాలేదు. అయితే వారి మధ్య సీరియస్ చర్చ సాగిందని సోషల్ మీడియాలో చర్చ సాగింది.

ఈ ఘటనపై ఉద్ధవ్ ఠాక్రేను మీడియా ప్రశ్నించగా.. ఇక తాము రహస్య సమావేశాలన్నింటినీ లిఫ్ట్‌లోనే పెట్టుకుంటామని సరదాగా అన్నారు. ఫడ్నవీస్, తాను ఒకే లిఫ్ట్‌లో వెళ్లినప్పుడు బహుశా చాలామంది అనేక రకాలుగా అభిప్రాయపడి ఉంటారని... కానీ అలాంటిదేమీ లేదన్నారు. తాము అనుకోకుండా మాత్రమే కలిశామన్నారు.

మరోవైపు, బీజేపీ మంత్రి చంద్రకాంత్ పాటిల్ గురువారం మర్యాదపూర్వకంగా ఠాక్రేను కలిశారు. ఠాక్రేకు ఆయన ఓ చాక్లెట్ ఇచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. శుక్రవారం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న చివరి ఎన్నికలు ఇవి.
Uddhav Thackeray
Devendra Fadnavis
BJP
Shiv Sena

More Telugu News