Kalki 2898 AD: తొలి రోజే రికార్డుల దుమ్ము దులిపిన ‘కల్కి 2898 ఏడీ’.. ప్రతి 10 మంది ప్రేక్షకులలో 9 మంది ఈ మూవీకే!

Kalki 2898 AD box office Records nears Rs 100 crore
  • ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో భారీ తారాగణంతో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’
  • తొలి రోజే రూ. 100 కోట్లకు చేరువలో కలెక్షన్లు
  • ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు
టాలీవుడ్ అగ్రనటుడు ప్రభాస్-దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘కల్కి 2898 ఏడీ’. ప్రపంచవ్యాప్తంగా నిన్న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు రికార్డులను తిరగరాస్తోంది. రిలీజ్‌కు ముందే రికార్డులు సొంతం చేసుకున్న ఈ మూవీ కలెక్షన్ల దుమ్ము దులుపుతోంది. మహాభారతంలోని ఘట్టాలకు సైన్స్‌ను ముడిపెడుతూ రూపొందించిన ఈ మూవీకి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.

ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్ వసూళ్లు సాధించిన చిత్రంగా కల్కి రికార్డును సొంతం చేసుకుంది. తొలి రోజు భారత్‌లో ఏకంగా రూ.95 కోట్ల వసూళ్లు సాధించింది. ఓవరాల్‌గా నిన్న 85.15 శాతం ఆక్యుపెన్సీ సాధించింది. మ్యాట్నీ షోలలో 81.56 శాతం, ఫస్ట్ షోలలో 82.33 శాతం, సెకండ్ షోలలో 90.35 శాతం ఆక్యుపెన్సీ సొంతం చేసుకుంది. అంటే నిన్న సినిమాలు చూసిన ప్రతి 10 మందిలో దాదాపుగా 9 మంది కల్కి చూసినవారే కావడం గమనార్హం.
Kalki 2898 AD
Prabhas
Nag Ashwin
Amitabh Bachchan
Kamal Haasan
Kalki Records

More Telugu News