General Elections-2024: ఎన్నికల విధులు నిర్వర్తించిన అధికారులు, సిబ్బందికి గౌరవ వేతనం ప్రకటించిన ఈసీ

EC announces honorarium for election staff


ఇటీవల దేశంలో సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు, నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు సజావుగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో, సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బందికి కేంద్ర ఎన్నికల సంఘం ఒక నెల గౌరవ వేతనం ప్రకటించింది. ఒక నెల గరిష్ఠ వేతనానికి సమానంగా గౌరవ వేతనం చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) కార్యాలయం నుంచి ఉత్తర్వులు రాగా... ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా జిల్లాల కలెక్టర్లకు ఆ మేరకు ఆదేశాలు ఇచ్చారు.

  • Loading...

More Telugu News