Chandrababu: లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు అందించనున్న సీఎం చంద్రబాబు
- జులై 1న పెరిగిన పెన్షన్ లు అందజేయనున్న కూటమి ప్రభుత్వం
- తాడేపల్లి మండలం పెనుమాకలో పెన్షనర్ల ఇళ్లకు వెళ్లనున్న సీఎం చంద్రబాబు
- వారికి తన చేతులమీదుగా పెన్షన్ల పంపిణీ
ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జులై నుంచి పెంచిన పెన్షన్లు పంపిణీ చేయనుంది. ఏప్రిల్ నుంచి పెరిగిన పెన్షన్ తో కలిపి జులై 1వ తేదీన రూ.7 వేల పెన్షన్ ఇవ్వనున్నారు. సచివాలయ సిబ్బంది పెన్షనర్ల ఇళ్లకు వెళ్లి రూ.7 వేలు అందించనున్నారు.
కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందించనున్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో జులై 1వ తేదీన చంద్రబాబు పెన్షనర్ల ఇళ్లకు వెళ్లనున్నారు. పెంచిన పెన్షన్లను వారికి తన చేతుల మీదుగా అందించనున్నారు. ఓ సీఎం పెన్షనర్ల ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందజేయడం దేశంలోనే ఇది తొలిసారి. ఈ సందర్భంగా, సీఎం చంద్రబాబు పెన్షన్ అందించడమే కాకుండా, లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నారు.