Nara Lokesh: కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యలపై లోకేశ్ ఘాటు స్పందన

Nara Lokesh Reacts To Congress Leader Jai Ram Ramesh Comments
  • అరకు ఆర్గానిక్ కాఫీ బ్రాండ్‌ను తానే కనిపెట్టినట్టు మోదీ డబ్బా కొట్టుకుంటున్నారన్న జైరాం రమేశ్
  • మోదీ వ్యాఖ్యలు, షేర్ చేసిన ఫొటోలతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారన్న లోకేశ్
  • మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నామన్న మంత్రి
అరకు ఆర్గానిక్ కాఫీ బ్రాండ్‌ను తానే కనిపెట్టినట్టు మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ డబ్బా కొట్టుకున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. జాతీయ పార్టీ నాయకుడైన జైరాం రమేశ్ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నామని పేర్కొన్నారు.

అరకు కాఫీ గురించి ప్రధాని మోదీ గొప్పగా చెప్పారని, దశాబ్దాలుగా క్రియాశీలంగా ఉన్న గిరిజన సహకార సంఘం గురించి స్పష్టంగా వివరించారని లోకేశ్ పేర్కొన్నారు. అరకు కాఫీపై ప్రధాని చేసిన వ్యాఖ్యలు, షేర్ చేసిన ఫొటోలపై సీఎ చంద్రబాబు సహా రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, మీరు అనుకుంటున్నట్టుగా మోదీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని లోకేశ్ ‘ఎక్స్’ ద్వారా సమాధానమిచ్చారు.
Nara Lokesh
Jairam Ramesh
Narendra Modi
Araku Coffee
Chandrababu

More Telugu News