K Kavitha: బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు షాక్.. జ్యుడీషియల్ కస్టడీ మరోసారి పొడిగింపు!

BRS MLC Kavitha Custody Extended Till July 25th
ఢిల్లీ మద్యం కుంభ‌కోణం కేసులో బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్‌ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ఆమె కస్టడీని జులై 25 వరకు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈడీ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగిసిన నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు ఆమెను కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసు విచారణను రౌస్‌ అవెన్యూ కోర్టు జులై 25కు వాయిదా వేస్తూ, అప్పటి వరకు ఆమె కస్టడీని పొడిగించింది.
K Kavitha
BRS
Custody
Delhi Liquor Scam

More Telugu News