Putta Mahesh Kumar: హైదరాబాద్ నుంచి కడపకు విమానం నడపాలి: కేంద్రమంత్రి రామ్మోహన్ కు ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ లేఖ

Eluru MP Putta Mahesh wrote union minister Ram Mohan Naidu seeking flight service between Hyderabad and Kadapa
ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు లేఖ రాశారు. హైదరాబాద్ నుంచి కడపకు విమానం నడపాలని తన లేఖలో కోరారు. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో కడప ఒకటని లేఖలో పేర్కొన్నారు. కడప... పరిశ్రమలు, విద్యాసంస్థలు, చారిత్రక కట్టడాలకు నిలయం అని పుట్టా మహేశ్ వివరించారు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులను కలవడం తెలిసిందే. కేంద్ర మంత్రులతో చంద్రబాబు కలిసిన సమయంలో ఆయన వెంట పుట్టా మహేశ్ కూడా ఉన్నారు.
Putta Mahesh Kumar
Kinjarapu Ram Mohan Naidu
Flight
Hyderabad-Kadapa
TDP
Andhra Pradesh

More Telugu News