Hugh Jackman: రోహిత్ శ‌ర్మ నా ఫేవ‌రెట్‌ క్రికెటర్: హాలీవుడ్ హీరో హ్యూ జాక్‌మ‌న్‌

Hugh Jackman calls Rohit Sharma his favourite Indian cricketer


త‌న ఫేవ‌రెట్ క్రికెట‌ర్ రోహిత్ శ‌ర్మ అని మార్వెల్ సిరీస్ ఎక్స్‌-మెన్ హీరో హ్యూ జాక్‌మ‌న్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో గ్లింప్స్‌ను మార్వెల్ ఇండియా 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదికగా పంచుకుంది. ఓ ఇంట‌ర్వ్యూలో జాక్‌మ‌న్‌కు టీమిండియాలో మీ ఫేవ‌రెట్ క్రికెట‌ర్ ఎవ‌రు? అనే ప్ర‌శ్న ఎదురైంది. 

దానికి ఆయ‌న స‌మాధానం ఇస్తూ.. "నేను క్రికెట్‌కు పెద్ద అభిమానిని. నా ఫేవ‌రెట్ క్రికెట‌ర్ హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌. క్రికెట్‌లో రోహిత్ బీస్ట్" అని అన్నారు. కాగా, ఈ ఇంట‌ర్వ్యూ తాలూకు పూర్తి వీడియో త్వ‌ర‌లో రానుంది. హ్యూ జాక్‌మ‌న్ న‌టించిన డెడ్‌పూల్ అండ్ వోల్వ‌రిన్ మూవీ ఈ నెల 26న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న చిత్రం ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్న‌ట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News