Konda Surekha: టీటీడీ బోర్డులో తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం కావాలన్న కొండా సురేఖ

Konda Surekha appeals for TG people in TTD Board

  • దేవాదాయ శాఖ భూములకు సంబంధించిన అంశాలపై చర్చ జరగాలన్న మంత్రి
  • తెలంగాణ ఆలయాలకు టీటీడీ నుంచి రూ.10 లక్షలు రావాలన్న సురేఖ
  • నేడు సాయంత్రం చంద్రబాబు, రేవంత్ రెడ్డిల సమావేశం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డులో తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో దేవాదాయ శాఖ భూములకు సంబంధించిన అంశాలపై చర్చ జరగాలని కోరారు. తెలంగాణలోని ఆలయాలకు టీటీడీ నుంచి రూ.10 లక్షలు రావాలని విజ్ఞప్తి చేశారు.

ఆషాడ బోనాల ఉత్సవాలు

బేగంపేటలోని హోటల్ హరిత టూరిజం ప్లాజాలో ఆషాడ బోనాల దశాబ్ద ఉత్సవాల దేవాలయాల కమిటీలకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ... రాష్ట్రమంతా సమృద్ధిగా వర్షాలు పడి, మంచి పంటలు పండాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. జులై 7 నుంచి గోల్కొండ బోనాలతో ఆషాడ మాస బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు.

బోనాల ఉత్సవాలను ఘనంగా జరిపేందుకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ఉత్సవాలు విజయవంతం కావాలంటే ప్రజల సహకారం అవసరమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అదనపు నిధులు తీసుకువచ్చినట్లు చెప్పారు. నిర్వహణలో లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News