Bhole Baba: హథ్రాస్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి భోలే బాబాపై కేసు

Case against Bhole Baba

  • తొక్కిసలాట ఘటనపై దర్యాఫ్తు చేస్తున్న యూపీ పోలీసులు
  • బాబా వేదికపై ఉండగానే తొక్కిసలాట జరిగిందని ప్రాథమిక దర్యాఫ్తులో వెల్లడి
  • భక్తులను భద్రతా సిబ్బంది తోసేశారని వెల్లడి

హథ్రాస్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి భోలే బాబాపై కేసు నమోదైంది. పాట్నా కోర్టులో కేసు ఫైల్ అయినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. జులై 2న నిర్వహించిన సత్సంగ్‌లో తొక్కిసలాట జరిగి 121 మంది భక్తులు మృతి చెందారు. 80 వేల మంది కోసం ఏర్పాట్లు చేయగా రెండు లక్షల మందికి పైగా వచ్చారు.

ఈ ఘటనపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. భోలే బాబా వేదికపై ఉన్న సమయంలోనే తొక్కిసలాట ఘటన చోటు చేసుకుందని విచారణలో తేలింది. భక్తులను భద్రతా సిబ్బంది తోసేశారని ఈ దర్యాఫ్తులో వెల్లడైంది. పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు.

సేవాధర్ ఆర్మీగా పిలిచే బృందం ఈ సత్సంగ్ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసింది. దీంతో ఈ ప్రమాదానికి సంబంధించి సేవాధర్ ఆర్మీలోని కీలక వ్యక్తి మధుకర్‌ను పోలీసులు నిందితుడిగా పేర్కొన్నారు. అతనిని పోలీసులు నిన్న రాత్రి కస్టడీలోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News