Lavanya: రాజ్ తరుణ్ నుంచి ప్రాణహాని ఉందంటూ మీడియా ముందుకు వచ్చిన లావణ్య

Lavanya made severe allegations on Raj Tarun again
గత కొన్నిరోజులుగా హీరో రాజ్ తరుణ్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్న షార్ట్ ఫిలిం నటి లావణ్య తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చారు. రాజ్ తరుణ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. హీరోయిన్ మాల్వీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న రాజ్ తరుణ్ తనను వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. 

"మొదట నాకు అమౌంట్ యాక్సెస్ కట్ చేశాడు. ఆ తర్వాత నాపై చెడు ముద్ర వేసేందుకు ప్రయత్నించాడు. యాంటీగా చెప్పడానికి నాపై ఏమున్నాయి? అందుకే నాపై ఉన్న డ్రగ్స్ కేసును, మస్తాన్ పై ఉన్న కేసును చూపిస్తున్నాడు. మాల్వీ, ఆమె సోదరుడు, రాజ్ తరుణ్ కూడా నన్ను బెదిరించారు. 

నేనేమీ అతను హీరో అయ్యాక అతడి లైఫ్ లోకి రాలేదు. అతడు హీరో కాకముందే వైజాగ్ లో ఉన్నప్పటి నుంచే పరిచయం. అతడు ఉయ్యాల జంపాల సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు మేం పక్క పక్క ఫ్లాట్లలో ఉండేవాళ్లం. మన రిలేషన్ ఇప్పుడే బయటపెట్టొద్దు... కొంత సమయం తర్వాత చెబుదాం అని అన్నాడు. కానీ ఇప్పుడు మాల్వీ మల్హోత్రా మోజులో పడ్డాడు. మాల్వీతో అతడి ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి" అని లావణ్య వివరించారు. 

అంతేకాదు, "మాల్వీ తండ్రి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రికి స్నేహితుడు... నువ్వు కేసు పెడితే వాళ్లు కూడా కేసు పెట్టారు... నువ్వు రభస చేస్తే వాళ్లు కూడా రభస చేయరనుకుంటున్నావా... వాళ్లు తలుచుకుంటే మరుక్షణమే నువ్వు జైలుకు వెళతావు... ఇక బయటికి కూడా రావు" అని బెదిరించినట్టు తెలిపారు. 

మాల్వీతో రాజ్ తరుణ్ కు అఫైర్ ఉందన్నది 100 శాతం నిజం అని అన్నారు. అయితే నన్ను తప్పుడుదాన్ని చేసి, ఆమెను పెళ్లాడాలని అనుకుంటున్నాడని, అతడు లేకుండా తాను బయటికి వెళ్లి ఎలా తలెత్తుకుని బతకగలనని లావణ్య వాపోయారు.
Lavanya
Raj Tarun
Relationship
Hyderabad
Tollywood

More Telugu News