Abhishek Sharma: రెండో మ్యాచ్‌లోనే రికార్డుల వరద పారించిన అభిషేక్‌శర్మ.. బోల్డన్ని రికార్డుల మాయం!

Abhishek Sharma breaks multiple records

  • టీ 20ల్లో వరసగా మూడు సిక్సర్లు బాది సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా అభిషేక్
  • స్పిన్నర్ల నుంచి ఏకంగా 65 పరుగులు పిండుకున్న ఆటగాడిగానూ రికార్డు
  • టీ20ల్లో జింబాబ్వేలో సెంచరీ సాధించిన తొలి ఆటగాడు కూడా అతడే

టీమిండియా యువ ఆటగాడు అభిషేక్  శర్మ అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. జింబాబ్వేతో నిన్న హరారేలో జరిగిన రెండో టీ20లో సెంచరీ సాధించిన అభిషేక్.. అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా మూడు సిక్సర్లు బాది సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అలాగే, టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన మూడో ఆటగాడిగానూ తన పేరు లిఖించుకున్నాడు. కాగా, శుభమన్‌గిల్ పేరున కూడా ఇలాంటి రికార్డే ఉంది. కాకపోతే అది వన్డేల్లో. 2023లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో గిల్ ఇలా మూడు సిక్సర్లతో డబుల్ సెంచరీ సాధించాడు. 

తాజా మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 46 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 2017లో రోహిత్‌శర్మ 35 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 2023లో సూర్యకుమార్ యాదవ్ 45 బంతుల్లో శతకం సాధించాడు. ఇద్దరూ శ్రీలంకపైనే ఆ ఘనత సాధించారు. 2016లో వెస్టిండీస్‌పై కేఎల్ రాహుల్ 46 బంతుల్లో సెంచరీ పూర్తిచేశాడు. ఆడిన రెండో మ్యాచ్‌లో సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగానూ అభిషేక్ రికార్డులకెక్కాడు. ఐసీసీ పూర్తి సభ్యత్వం కలిగిన దేశాల్లో ఈ ఘనత ఒక్క అభిషేక్‌కే దక్కింది. గతంలో ఎవిన్ లూయిస్ కూడా తొలి మ్యాచ్‌లో డకౌట్ అయి, రెండో మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. రిచర్డ్ లెవిస్ కూడా ఇలా రెండో మ్యాచ్‌లో శతకం బాదాడు.   

ఈ మ్యాచ్‌లో అభిషేక్ స్పినర్ల బౌలింగ్‌లో 65 పరుగులు పిండుకున్నాడు. టీ20 క్రికెట్‌లో మరే ఇండియన్ ఈ ఘనత సాధించలేదు. 2012లో అహ్మదాబాద్‌తో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ స్పిన్నర్ల నుంచి 57 పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 28 బంతుల్లోనే 232.14 స్ట్రైక్‌రేట్‌తో ఆరు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 65 పరుగులు చేశాడు. 
అభిషేక్ తన చివరి 23 బంతుల్లో ఏకంగా 72 పరుగులు సాధించాడు. ఇందులో 7 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. అభిషేక్ తొలుత ఎదుర్కొన్న 24 బంతుల్లో కేవలం 28 పరుగులే చేశాడు. ఇందులో మూడు బౌండరీలు ఉన్నాయి.   
టీ20ల్లో అభిషేక్ శర్మ కంటే ముందు ఇద్దరు మాత్రమే జింబాబ్వేలో సెంచరీలు నమోదు చేశారు. 2018లో ఆసీస్ బ్యాటర్ అరోన్‌ఫించ్ 172 పరుగులతో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అమెరికా ఆటగాడు స్టీవెన్ టేలర్ 2022లో అజేయ సెంచరీ (101) సాధించాడు. 
రెండో టీ20లో భారత జట్టు చేసిన 234 పరుగులే హరారేలో జింబాబ్వేపై అత్యధిక స్కోరు. 2018లో ఆస్ట్రేలియా జట్టు ఇక్కడ 229 పరుగులు సాధించింది. 2022లో సింగపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 5 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. హరారేలో ఇదే అత్యధిక స్కోరు. 
చివరి 10 ఓవర్లలో భారత జట్టు ఏకంగా 161 పరుగులు సాధించింది. ఇది మూడో అత్యధిక స్కోరు. 2023లో మంగోలియాపై నేపాల్‌పై 192 పరుగులు సాధించింది. ఈ ఏడాది మొదట్లో చైనాపై జపాన్ జట్టు 161 పరుగులు చేసింది. 


  • Loading...

More Telugu News