Brahmanandam: కమల్ హాసన్ వాయిస్‌ను దించేసిన బ్రహ్మానందం.. బ్ర‌హ్మీ టాలెంట్‌కు ఆడియ‌న్స్ ఫిదా.. నెట్టింట‌ వీడియో వైరల్‌!

Brahmanandam Imitating Kamal Hassan Video goes Viral on Social Media
  • కమల్ హాసన్, శంకర్ కాంబోలో 'భారతీయుడు-2'
  • జులై 12న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్
  • హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన చిత్ర‌ తారాగణం
  • ఈ సంద‌ర్భంగా క‌మ‌ల్ వాయిస్‌ను మిమిక్రీ చేసిన బ్ర‌హ్మీ
విశ్వ‌న‌టుడు కమల్ హాసన్, అగ్ర ద‌ర్శ‌కుడు శంకర్ కాంబినేషన్‌లో తెర‌కెక్కిన‌ 'భారతీయుడు-2' చిత్రం ఈ నెల‌ 12న వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో భారతీయుడు-2 చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వ‌హించిన‌ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కమల్ హాసన్, దర్శకుడు శంకర్, నిర్మాత సుభాస్కరన్, యువ హీరో సిద్ధార్థ్, సముద్రఖని, ఎస్‌జే సూర్య, బాబీ సింహా, హస్యనటుడు బ్రహ్మానందం తదితరులు విచ్చేశారు. 

ఈ సంద‌ర్భంగా బ్ర‌హ్మానందం వేదిక‌పై ప్ర‌సంగించారు. అయితే, కమల్‌ హాసన్‌ ఎదురుగానే బ్రహ్మానందం ఆయన్ని ఇమిటేట్‌ చేయ‌డం గ‌మ‌నార్హం. ఇలా త‌న‌లో ఉన్న మరో టాలెంట్‌ను చూపించి అక్క‌డికి వ‌చ్చిన ప్రేక్ష‌కుల‌ను బ్ర‌హ్మీ అలరించారు. కమల్‌హాసన్‌లా మాట్లాడిన బ్ర‌హ్మానందం వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది.

"భారతీయుడు మొదటి భాగాన్ని హిట్‌ చేశారు. ఇప్పుడు రెండో పార్ట్‌తో సిద్ధమయ్యాను. ఈ సినిమా కోసం ఎక్కువ కష్టపడ్డాను. దక్షిణాది ప్రేక్షకులు నన్నెంతో ఆదరిస్తున్నారు. నాకు సంతోషంతో మాటలు రావడం లేదు. ఈ సినిమాను మీరంతా ఆదరిస్తే ఇంకాస్త సంతోషిస్తా. మీ కమల్ హాసన్‌" అని బ్ర‌హ్మీ ఆయనలా మాట్లాడారు. ఈ స్పీచ్‌ను కమల్ కూడా ఎంజాయ్ చేయ‌డం వీడియోలో క‌నిపించింది.   

ఇక కాలేజీలో చ‌దువుకునే రోజుల్లో అంద‌రూ ఎన్‌టీఆర్‌, ఏఎన్ఆర్‌ల‌ను ఇమిటేట్ చేస్తే తాను మాత్రం క‌మ‌ల్ వాయిస్‌ను మిమిక్రీ చేసేవాడిన‌ని అన్నారు. ఇటీవ‌ల ఆయ‌న కూతురు, న‌టి శ్రుతి హాస‌న్ ముందు మిమిక్రీ చేస్తే 'నాన్న‌లానే మాట్లాడారు' అని కితాబు ఇచ్చార‌ట‌. దాంతో త‌న‌లో ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింద‌ని ఈ సంద‌ర్భంగా బ్ర‌హ్మానందం గుర్తు చేశారు.
Brahmanandam
Imitating
Kamal Hassan
Social Media
Bharateeyudu2
Tollywood
Kollywood

More Telugu News