Hariprasad: ఎమ్మెల్సీగా ఏకగ్రీవం... సర్టిఫికెట్ అందుకున్న జనసేన నేత హరిప్రసాద్
- ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ
- టీడీపీ నుంచి సి.రామచంద్రయ్యకు, జనసేన నుంచి హరిప్రసాద్ కు చాన్స్
- ఇరువురు ఏకగ్రీవ ఎన్నిక
- నేడు అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం అందుకున్న హరిప్రసాద్
ఇటీవల ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ నుంచి సి.రామచంద్రయ్య, జనసేన నుంచి హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, హరిప్రసాద్ నేడు అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ, జనసేనాని పవన్ కల్యాణ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వెల్లడించారు.
"శాసనమండలి సభ్యుడిగా ఎన్నికవడం ఎంతో సంతోషం కలిగిస్తోంది. ఎమ్మెల్సీ పదవిని బాధ్యతాయుతమైన పదవిగా భావిస్తున్నాను. నాపై నమ్మకం ఉంచి ఎమ్మెల్సీ బాధ్యతలు అప్పగించిన డిప్యూటీ సీఎం, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబు, టీడీపీ, జనసేన నేతలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శాసనమండలి తొలి సమావేశాలు ప్రారంభం అయ్యేందుకు కొంత సమయం ఉంది. కౌన్సిల్ సమావేశాలు, ప్రశ్నోత్తరాలు, చర్చ, భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలి? అనే అంశాలపై అధ్యయనం చేయడానికి నాకు ఈ సమయం ఉపయోగపడుతుంది" అని హరిప్రసాద్ పేర్కొన్నారు.