AP TET 2024: ఏపీ టెట్ కొత్త షెడ్యూల్ విడుదల

Revised Schedule for AP TET 2024

  • అభ్య‌ర్థుల విజ్ఞప్తి మేర‌ షెడ్యూల్‌లో మార్పులు చేసిన ప్ర‌భుత్వం 
  • ఈ నెల 2న విడుద‌లైన నోటిఫికేష‌న్ ప్రకారం ఆగ‌స్టు 5 నుంచి 20 వ‌ర‌కు టెట్ ప‌రీక్ష‌లు
  • ఆ ప‌రీక్ష‌లు అక్టోబ‌ర్ 3 నుంచి 20కి మార్పు
  • మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ఆమోదం

ఏపీ ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష (టీఈటీ) షెడ్యూల్‌లో ప్ర‌భుత్వం మార్పులు చేసింది. జులై 2న విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్ ప్రకారం ఆగ‌స్టు 5 నుంచి 20 వ‌ర‌కు టెట్ ప‌రీక్ష‌లు జ‌ర‌గాల్సి ఉండ‌గా, ఆ ప‌రీక్ష‌ల‌ను అక్టోబ‌ర్ 3 నుంచి 20 వ‌ర‌కు నిర్వ‌హిస్తామ‌ని తెలిపింది. 

ప్రిప‌రేష‌న్‌కు స‌మ‌యం కోసం అభ్య‌ర్థుల అభ్య‌ర్థ‌న మేర‌కు స‌వ‌ర‌ణ నోటిఫికేష‌న్‌ను సోమ‌వారం విడుద‌ల చేసింది. ఇక రాష్ట్రంలో మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే. కాగా, డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. 

టెట్ కొత్త షెడ్యూల్ ఇదే..
  • నోటిఫికేష‌న్ విడుద‌ల‌:  జులై 2
  • ప‌రీక్ష ఫీజు చెల్లింపున‌కు, ద‌ర‌ఖాస్తుకు ఆఖ‌రి గ‌డువు: ఆగ‌స్టు 3
  • ఆన్‌లైన్ మాక్ టెస్టు: సెప్టెంబ‌ర్ 19 నుంచి 
  • ప‌రీక్ష‌లు: అక్టోబ‌ర్ 3 నుంచి 20 వ‌ర‌కు (రెండు సెష‌న్ల‌లో)
  • ప్రాథ‌మిక కీ విడుద‌ల‌: అక్టోబ‌ర్ 3
  • ప్రాథ‌మిక కీపై అభ్యంత‌రాల స్వీక‌ర‌ణ‌: అక్టోబ‌ర్ 4 నుంచి
  • ఫైన‌ల్ కీ విడుద‌ల‌: అక్టోబ‌ర్ 27
  • ఫ‌లితాల విడుద‌ల‌: న‌వంబ‌ర్ 2

  • Loading...

More Telugu News