Vijayalaxmi: అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఫిర్యాదు

GHMC mayor complaints in CCS police
  • సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మేయర్
  • సోషల్ మీడియాలో కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని ఆవేదన
  • మంత్రి పొన్నంతో పాటు తనను కూడా ట్రోల్ చేస్తున్నారని ఫిర్యాదు
తనపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదును అందించారు. తనను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు తనను కూడా ట్రోల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Vijayalaxmi
GHMC
Hyderabad

More Telugu News