Adani Group: పారిస్ ఒలింపిక్స్ లో భారత బృందానికి స్పాన్సర్ గా అదానీ గ్రూప్

Adani group sponsors Indian contingent at Paris Olympics 2024
  • ఈసారి ఒలింపిక్ క్రీడలకు పారిస్ ఆతిథ్యం
  • జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు ఒలింపిక్ క్రీడలు
  • స్పాన్సర్ గా భారత అథ్లెట్లకు పూర్తి మద్దతు ఇస్తామన్న గౌతమ్ అదానీ
మరి కొన్ని రోజుల్లో విశ్వ క్రీడా సంరంభం ఒలింపిక్స్ కు తెరలేవనుంది. ఈసారి ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరం ఒలింపిక్స్ కు ఆతిథ్యమిస్తోంది. ఎప్పట్లాగానే భారత్ ఈసారి కూడా ఒలింపిక్స్ కు భారీ బృందాన్నే పంపుతోంది. 

113 మంది అథ్లెట్లతో కూడిన భారత బృందానికి పారిస్ ఒలింపిక్స్ లో అదానీ గ్రూప్ ప్రధాన స్పాన్సర్ గా వ్యవహరించనుంది. ఈ మేరకు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడించారు. ఓ స్పాన్సర్ గా భారత అథ్లెట్లకు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. 

కాగా, 'దేశ్ కా గీత్ ఎట్ ఒలింపిక్స్' పేరిట భారత అథ్లెట్లకు మద్దతుగా ఓ వీడియోను కూడా అదానీ గ్రూప్ సిద్ధం చేసింది. పారిస్ ఒలింపిక్స్ జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్నాయి.
Adani Group
Sponsor
India
Paris Olympics-2024

More Telugu News