AP High Court: మూవీ టిక్కెట్ ధరలు పెంచే అధికారం ప్రభుత్వానికి ఉందో లేదో తేలుస్తాం: ఏపీ హైకోర్టు

AP high court to conduct in depth hearing on governments jurisdiction over tickets price hike


కొత్త సినిమాల టిక్కెట్ల ధరలు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? లేదా? అనే అంశంపై లోతైన విచారణ చేస్తామని ఏపీ హైకోర్టు తాజాగా పేర్కొంది. ఈ అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని, ఇతర ప్రతివాదులను ఆదేశించింది. సినిమా టిక్కెట ధరల విషయంలో గతంలో దాఖలైన వ్యాజ్యంతో ప్రస్తుత పిల్‌ను జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ ఎన్. జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. 

కల్కి సినిమా ధరలను 14 రోజుల పాటు పెంచుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ పి. రాకేశ్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిల్ వేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక న్యాయవాది ఎన్. ప్రణతి వాదనలు వినిపిస్తూ.. పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు మరికొంత సమయం కావాలని అన్నారు.

  • Loading...

More Telugu News