Telangana: రైతుబంధుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నోటీసు... ఆ 16 లక్షలు తిరిగివ్వాలని ఓ రైతుకు ఆదేశాలు!
- వ్యవసాయేతర భూమిపై తీసుకున్న రైతుబంధు నిధులను వెనక్కివ్వాలని నోటీసులు
- మేడ్చల్ జిల్లా పోచారం గ్రామ రైతు యాదగిరి రెడ్డికి నోటీసులు
- వ్యవసాయేతర భూములకు రైతుబంధు తీసుకున్న లబ్ధిదారులందరి నుంచి రికవరీకి యత్నం
రైతుబంధుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయేతర భూమిపై తీసుకున్న రైతుబంధు నిధులను వెనక్కి ఇవ్వాలని ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం రైతు యాదగిరిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. వెంచర్లపై రైతుబంధు తీసుకున్నందున... ఆ మొత్తం రికవరీకి ఆదేశాలు ఇచ్చింది. అతను తీసుకున్న రూ.16 లక్షలను తిరిగి చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది.
యాదగిరిరెడ్డి గతంలో 33 ఎకరాల భూమిని ఫ్లాట్లుగా చేసి విక్రయించినట్లు గుర్తించింది. ప్లాట్లుగా విక్రయించిన ఆ భూమిపై రైతుబంధు పేరిట అతను రూ.16 లక్షలు పొందినట్లు ప్రభుత్వం గుర్తించింది. వ్యవసాయేతర భూములకు రైతుబంధు తీసుకున్న లబ్ధిదారుల నుంచి కూడా రికవరీకి చర్యలను ప్రభుత్వం ప్రారంభించనుంది.