Joe Biden: ప్రామిస్.. నేను బాగానే ఉన్నా.. అమెరికా అధ్యక్షుడు బైడెన్

I Promise You I Am Ok Biden Insists On Return To Campaign Trail

  • అధ్యక్ష ఎన్నికల బరిలోంచి బైడెన్ తప్పుకోవాలంటూ సొంత పార్టీ నేతల డిమాండ్
  • తాను బాగానే ఉన్నానని బైడెన్ స్పష్టీకరణ, ఎన్నికల నుంచి తప్పుకునేందుకు ససేమిరా
  • ట్రంప్‌ను ఎదుర్కొనేందుకు తానే తగిన వ్యక్తినని స్పష్టీకరణ

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వృద్ధాప్య సంబంధిత సమస్యలతో సతమతవుతున్న వార్తల నడుమ ఆయన ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవాలంటూ డిమాండ్లు నానాటికీ పెరుగుతున్నాయి. తాజాగా ఈ పరిణామాలపై స్పందించిన బైడెన్ తాను బాగానే ఉన్నానని పార్టీ సభ్యులు, మద్దతుదారులకు భరోసా ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ట్రంప్‌ను ఎదుర్కొనేందుకు తానే తగిన వ్యక్తినని స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. ‘‘మనం ఈ పని ఎలాగైనా పూర్తి చేయాలి. నేను బాగానే ఉన్నా.. మీకు ఆందోళన వద్దు’’ అని మిషిగన్‌లోని ఓ రెస్టారెంట్‌లో తన మద్దతుదారుల సమక్షంలో భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే, బైడెన్ తప్పుకోవాలని మాత్రం సొంత డెమోక్రటిక్ పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. ఈ దిశగా ఇప్పటికే 19 మంది చట్టసభ సభ్యులు బహిరంగ ప్రకటనలు చేశారు. 

ఇటీవల డొనాల్డ్ ట్రంప్‌తో టీవీ చర్చ సందర్భంగా బైడెన్ దీటుగా సమాధానం చెప్పలేక, మాటలకోసం తడబడి, పొరబడి తన ప్రత్యర్థి ముందు తేలిపోయారు. దీంతో, మతిమరుపు వంటి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న బైడెన్ తప్పుకోవాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. దీంతో, నష్టనివారణ చర్చలకు దిగిన బైడెన్ తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని మరో టీవీ ఇంటర్వ్యూలో భరోసా ఇచ్చినా పరిస్థితి సద్దుమణగలేదు. ఆ తరువాత కూడా బైడెన్ పలుమార్లు సరిగా పేర్లు గుర్తుచేసుకోలేక ఇబ్బంది పడ్డారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని పుతిన్ అని పిలవడం, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను ట్రంప్ అని సంబోధించడం ఆయన వ్యతిరేకులకు కొత్త ఆయుధాలను ఇచ్చింది. దీంతో రిపబ్లికన్  పార్టీ కీలక నేతలు బైడెన్ తప్పుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారు. డెమోక్రాట్ పార్టీకి విరాళమిచ్చిన ప్రముఖ హాలీవుడ్ స్టార్ జార్జ్ క్లూనీ కూడా బైడెన్ ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవాలని అన్నారు. 

అయితే, బైడెన్ నోట ఇలాంటి పొరపాట్లు దొర్లడం సాధారణమేనని బైడెన్ ప్రచార కార్యక్రమాల నిర్వహకుడు మైఖేల్ టైలర్ పేర్కొన్నారు. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అనేక మార్లు బైడెన్ ఇలా తడబడ్డారని, ఆయన గురించి తెలిసిన వారికి ఇది పెద్ద విషయం కాదని అన్నారు. భవిష్యత్తులో కూడా బైడెన్ ఇలాంటి పొరపాట్లు చేస్తారని కూడా అన్నారు. 

బైడెన్ పరిస్థితిని ఇప్పటికే పలుమార్లు ఎద్దేవా చేసిన ట్రంప్ తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జార్జ్ క్లూనీ, బరాక్ ఒబామా లాంటి విఫల వ్యక్తుల మాట బైడెన్ వినకూడదని, తన భవిష్యత్తుపై తనే ఓ నిర్ణయం తీసుకోవాలని వ్యాఖ్యానించారు. బైడెన్ తప్పుకోవాలన్న డిమాండ్ల వెనక మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉన్నారన్న మీడియా వార్తల నేపథ్యంలో ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు. అయితే, బైడెన్ జెలెన్స్కీని పుతిన్ అని పిలవడం మాత్రం క్షమార్హం కాదని అన్నారు.  


  • Loading...

More Telugu News