Raj Tarun: రాజ్ లేని లైఫ్ నాకొద్దు.. ఆత్మహత్య చేసుకుంటా.. లావణ్య అర్ధరాత్రి మెసేజ్

Lavanya sends message to advocate wanthing to end life
  • రాజ్ తరుణ్ - లావణ్య వ్యవహారంలో మరో ట్విస్ట్
  • ఆత్మహత్య చేసుకుంటానంటూ తన అడ్వకేట్‌కు మెసేజ్ పెట్టిన లావణ్య
  • తన ఆత్మహత్యకు మాల్వీ ప్రధాన కారణమంటూ మెసేజ్‌లో పేర్కొన్న వైనం
  • సమాచారం అందుకున్న వెంటనే ఆమె వద్దకు వెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు
సినీ నటుడు రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అతడు తనను మోసం చేశాడంటూ ఇటీవల లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె శుక్రవారం అర్ధరాత్రి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తన అడ్వకేట్‌కు మెసేజ్ పంపించింది. తాను వెళ్లిపోతున్నట్టు అందులో పేర్కొంది. వెంటనే స్పందించిన అడ్వకేట్ డయల్ 112 ద్వారా నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అర్ధరాత్రి లావణ్య ఇంటికి వెళ్లి ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు. 

అయితే, తానేంటో తెలిసిన వారే తనను తప్పుబట్టారని లావణ్య తన మెసేజ్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రాజ్ లేని లైఫ్‌లో నేను ఉండలేను. బతకలేను. అన్నీ కోల్పోయాను. అందరి వల్ల నేనే మోసపోయాను. రాజ్ తల్లిదండ్రులు కూడా నా చావుకు కారణం. రాజ్ మొత్తం మారిపోయాడు. నా చావును కోరుకున్నాడు. మాల్వీ మల్హోత్రా నా చావుకు ప్రధాన కారణం. నా కుటుంబం, దిలీప్ సుంకర, మీడియాకు నా క్షమాపణలు’’ అంటూ లావణ్య అడ్వకేట్‌కు సందేశం పంపించింది.
Raj Tarun
Lavanya
Tollywood

More Telugu News