Tobacco Ads: త్వరలో క్రికెట్ స్టేడియాల్లో పొగాకు వాణిజ్య ప్రకటనలపై నిషేధం!
క్రికెట్ స్టేడియాల్లో పొగాకు ఉత్పత్తులను ప్రోత్సహించే వాణిజ్య ప్రకటనలపై నిషేధం విధించాలని కేంద్రం భావిస్తోంది.
పాన్ మసాలా, పొగాకు కలిసిన చూయింగ్ గమ్ లు, గుట్కాలు, పొగ రాని పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన వాణిజ్య ప్రకటనలను క్రికెట్ మ్యాచ్ లు జరిగే సమయంలో స్టేడియాల్లో ప్రదర్శించరాదని త్వరలోనే బీసీసీఐకి కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేయనుంది.
అంతేకాదు, పొగాకు, పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించేలా ఉండే వాణిజ్య ప్రకటనల్లో నటులు, క్రికెటర్లు నటించకుండా మార్గదర్శకాలు జారీ చేయాలని కూడా కేంద్రం యోచిస్తోంది.
2023 వరల్డ్ కప్ లో 17 మ్యాచ్ ల్లో పొగాకు ఉత్పత్తుల వాణిజ్య ప్రకటనల శాతం 41.3 అని ఐసీఎంఆర్, జీహెచ్ఓ ఓ నివేదికలో వెల్లడించాయి.