Madhu Yaskhi: కేసీఆర్ న్యాయవిచారణ ఎదుర్కోకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు: మధుయాష్కీ

Madhu Yashki lashes out at KCR over power commission

  • విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం న్యాయ విచారణను చేపడుతుందని వెల్లడి
  • విద్యుత్ ఒప్పందాలపై సుప్రీంకోర్టు విచారణ వ్యవస్థను రద్దు చేయలేదన్న మధుయాష్కీ
  • విచారణ చేసే జడ్జిని మాత్రమే మార్చమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్న కాంగ్రెస్ నేత

విద్యుత్ కొనుగోళ్ల విషయంలో అక్రమాలు జరిగాయని, కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ న్యాయవిచారణ ఎదుర్కోకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ అన్నారు. మంగళవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... విద్యుత్ కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణను చేపడుతోందన్నారు.

విద్యుత్ ఒప్పందాలపై సుప్రీంకోర్టు విచారణ వ్యవస్థను రద్దు చేయలేదని, విచారణ చేసే జడ్జిని మాత్రమే మార్చమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. టెక్నికల్ గ్రౌండ్స్ పైనే మార్చాలని న్యాయస్థానం చెప్పినట్లు తెలిపారు. అసలు పక్క రాష్ట్రం నుంచి విద్యుత్‌ను ఎలా కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో, విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందన్నారు. అక్రమంగా దోచుకున్న సొమ్మును కక్కిస్తామన్నారు.

  • Loading...

More Telugu News