Revanth Reddy: రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- ప్రజాభవన్‌లో కాంగ్రెస్ నేతల సమావేశం
- మూడు దఫాలుగా రైతు రుణమాఫీ చేస్తామన్న ముఖ్యమంత్రి
- రేపు సాయంత్రం రూ.1 లక్ష, నెలాఖరు నాటికి రూ.1.5 లక్షల రుణమాఫీ
- ఆగస్ట్‌లో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న ముఖ్యమంత్రి
రైతు రుణమాఫీకి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాభవన్‌లో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... మూడు దఫాలుగా రైతు రుణమాఫీ చేయనున్నట్లు చెప్పారు. రేపు సాయంత్రం 4 గంటలలోగా రూ.1 లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామన్నారు. రేపు సాయంత్రం లోగా నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామన్నారు.
ఈ నెలాఖరులోగా రెండో దఫాలో లక్షన్నర రూపాయల వరకు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. ఆగస్ట్ నెలలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. 7 నెలల్లోనే సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.30 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తున్నట్లు చెప్పారు. ఏకమొత్తంలో వీటిని మాఫీ చేస్తామని పేర్కొన్నారు.