Vegetables: కొండెక్కుతున్న టమాటా ధర.. విశాఖలో సెంచరీ
-
తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధర చుక్కలను తాకుతోంది. రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. ఇటీవల విజయవాడ మార్కెట్లో కిలో టమాటా రూ.64 పలకగా.. తాజాగా విశాఖపట్నంలో కిలో రూ.100 కు చేరింది. మార్కెట్ లో భగ్గుమంటున్న కూరగాయల ధరలతో సామాన్యులు బేంబేలెత్తిపోతున్నారు. దాదాపుగా అన్ని కూరలలోనూ టమాటాలను వాడుతుంటారని, పెరిగిన ధరల కారణంగా టమాటాలను కొనే పరిస్థితి లేదని వాపోతున్నారు.
టమాటాలతో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేవని చెబుతున్నారు. ఇలాగే పెరిగితే తమ పరిస్థితి ఏంటని వాపోతున్నారు. గత ప్రభుత్వం కూరగాయల ధరల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కొత్త ప్రభుత్వమైనా స్పందించి కూరగాయల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.