Bhole Baba: మరణం అనివార్యం.. విధి నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. తొక్కిసలాట ఘటనపై భోలేబాబా

Death is inevitable no one can escape destiny Said Bhole Baba
  • హత్రాస్ తొక్కిసలాట ఘటనలో 121 మంది మృతి
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన భోలే బాబా
  • ముందో, వెనకో.. ఏదో ఒక రోజు అందరం వెళ్లిపోవాల్సిందేనని వ్యాఖ్య
హత్రాస్ తొక్కిసలాట ఘటనపై స్వయం ప్రకటిత బాబా నారాయణ్ శంకర్ హరి అలియాస్ భోలేబాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేస్తూనే.. మరణం అనివార్యమని, విధిరాతను ఎవరూ తప్పించలేరని పేర్కొన్నారు. ముందో, వెనకో ప్రతి ఒక్కరూ తప్పక మరణించాల్సిందేనని వ్యాఖ్యానించారు.  

‘‘జులై 2 నాటి హత్రాస్ ఘటన తర్వాత మనమందరం తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్నాం. అయితే విధిని ఎవరూ తప్పించుకోలేరు.  ఎవరొచ్చినా రాకున్నా సరే, ఏదో ఒకరోజు ముందో, వెనకో వెళ్లిపోవాల్సిందే’’ అని వ్యాఖ్యానించారు. కొందరు వ్యక్తులు తమ సంస్థ నిర్వహిస్తున్నఆధ్యాత్మిక విధానాల పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే తొక్కిసలాట జరిగిందని భోలే బాబా పేర్కొన్నారు. దీనివెనక కుట్ర ఉందని ఆరోపించారు.
Bhole Baba
Narayan Sakar Hari
Hathras Stampade
Destiny

More Telugu News