Team India: శ్రీలంక పర్యటనకు జట్లు ప్రకటించిన బీసీసీఐ.. రెండు వేర్వేరు జట్లు.. కీలక మార్పులు

Suryakumar Yadav named new T20I captain and KL Rahul and Iyer returns as BCCI announce squad for Sri Lanka series
  • వన్డే జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్
  • వన్డే కెప్టెన్‌కు రోహిత్ శర్మ, టీ20లకు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్లుగా ఎంపిక
  • టీ20, వన్డే సిరీస్‌లకు వేర్వేరు జట్లు ప్రకటించిన సెలక్టర్లు
క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేసింది. అతి త్వరలోనే శ్రీలంకతో మొదలు కానున్న టీ20, వన్డే సిరీస్‌కు వేర్వేరు జట్లను బీసీసీఐ గురువారం ప్రకటించింది. టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత పొట్టి క్రికెట్ ఫార్మాట్‌కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో డ్యాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. కొత్త కెప్టెన్‌గా సెలక్టర్లు సూర్యకి అవకాశం ఇచ్చారు. ఇక వైస్ కెప్టెన్‌గా శుభ్‌మాన్ గిల్‌కు ఛాన్స్ ఇచ్చారు.

ఇక వన్డే సిరీస్ ఆడనున్న జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జట్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి కూడా చోటుదక్కింది. ఇక వన్డే జట్టులో కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌ ఇద్దరూ తిరిగి జట్టులోకి రావడం పెద్ద మార్పుగా కనిపిస్తోంది. 

టీ20 జట్టు ఇదే
సూర్యకుమార్ (కెప్టన్), శుభ్‌మాన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఖలీల్, మహ్మద్ సిరాజ్.

వన్డే జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మాన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాద్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.
Team India
KL Rahul
Shreyas Iyers
Surya Kumar Yadav
Rohit Sharma
Virat Kohli

More Telugu News