Vijayasai Reddy: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఎన్డీయే నుంచి టీడీపీ తప్పుకుంటుంది అనుకుంటున్నా: ఎంపీ విజయసాయి రెడ్డి

I am sure that TDP will pull out of NDA if Special Category Status is not given says YSRCP MP Vijayasai Reddy
  • అఖిలపక్ష భేటీ అనంతరం ఎక్స్ వేదికగా స్పందన
  • రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను ప్రస్తావించినట్టు వెల్లడి
  • కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన వైసీపీ ఎంపీ
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో న్యూఢిల్లీలో నేడు జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. భేటీ అనంతరం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హామీకి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తాను ఆశిస్తున్నానని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎన్డీయే నుంచి టీడీపీ కచ్చితంగా వైదొలగుతుందని భావిస్తున్నట్టు ఆయన వ్యాఖ్యానించారు.

ఇవాళ (ఆదివారం) న్యూఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యానని ఆయన తెలిపారు. ఏపీలో దెబ్బతిన్న శాంతిభద్రతలు, ఇతర సమస్యలపై మాట్లాడానని చెప్పారు. ఏపీలో ఎన్నో సమస్యలు ఉండగా ఒక కులం సమాజాన్ని అణచివేయడం సహా పలు అంశాలను అఖిలపక్ష భేటీలో లేవనెత్తానని ఆయన ప్రస్తావించారు. ఈ పార్లమెంట్ సెషన్‌లో టీడీపీ వైఖరిని ఎండగడతామని విజయసాయి రెడ్డి అన్నారు.
Vijayasai Reddy
YSRCP
Telugudesam
Andhra Pradesh

More Telugu News