Ashwin Babu: ‘శివం భజే’ అశ్విన్ కెరీర్లో నిలిచిపోవడం ఖాయం: హీరో విష్వక్సేన్
- అశ్విన్ బాబు హీరోగా 'శివమ్ భజే'
- దర్శకత్వం వహించిన అప్సర్
- కొంతసేపటి క్రితం వదిలిన ట్రైలర్
- ముఖ అతిథులుగా విష్వక్ .. తమన్ .. అనిల్ రావిపూడి
- ఆగస్టు 1వ తేదీన సినిమా రిలీజ్
అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటించిన చిత్రం 'శివం భజే' ఈ సినిమా ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. మంగళవారం నాడు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి విష్వక్సేన్, తమన్, అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
విష్వక్సేన్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ చూశా .. చాలా బాగుంది .. ఆర్ఆర్ అదిరిపోయింది. అశ్విన్ కెరీర్‌లో ఇది నిలిచిపోతుందనిపిస్తుంది. ట్రైలర్ చూస్తే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. ఆగస్ట్ 1న అశ్విన్‌కు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘శివం భజే' ట్రైలర్ బాగుంది.. అశ్విన్ ఏ సినిమా చేసినా ముందు నాకు చూపిస్తాడు. అశ్విన్ నాకు ఓ బ్రదర్ లాంటివాడు. అశ్విన్ కెరీర్‌లో 'శివం భజే' ది బెస్ట్ సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. నిర్మాత మహేశ్వర్ రెడ్డి గారికి మంచి సక్సెస్ రావాలి. డైరెక్టర్ అప్సర్ సినిమాను బాగా తీశారు. దిగంగనాకి ఈ చిత్రం పెద్ద విజయం చేకూరాలి. విష్వక్ ఇక్కడ కలవడం ఆనందంగా ఉంది" అని అన్నారు.
తమన్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ రెండ్రోజుల ముందే చూశాను. డైరెక్టర్ అప్సర్, నిర్మాత మహేశ్వర్ రెడ్డి గారికి, అశ్విన్‌కు, సినిమా టీమ్ కి ఆల్ ది బెస్ట్. ఒక ఆర్టిస్ట్‌కి ఒక్క టాలెంట్ ఉంటే సరిపోదు.. కసి కూడా ఉండాలి. అశ్విన్‌కు ఆ కసి ఉంటుంది. అశ్విన్ బాల్‌ను ఎలా బాదుతాడో.. బాక్సాఫీస్‌ను కూడా అలానే బాదాలి. గత కొన్ని రోజులుగా అశ్విన్ పడుతున్న కష్టం చూస్తున్నాను. 'శివం భజే' పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు.
అశ్విన్ బాబు మాట్లాడుతూ.. ‘అనిల్ రావిపూడి, తమన్, విశ్వక్ సేన్ పిలవడంతోనే వచ్చారు. వారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఒక మెసెజ్ పెట్టు వస్తాను అని అనిల్ రావిపూడి గారు అన్నారు. తమన్ నాకు పదేళ్లకు పైగా తెలుసు. తమన్ ఈ పదేళ్లలో ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. మాస్ కా దాస్ విష్వక్సేన్‌కి ఉన్న డేరింగ్ అండ్ డాషింగ్ మా యంగ్ హీరోల్లో ఇంకెవ్వరికీ లేదు. 'శివం భజే' కథను నిర్మాత నా వద్దకు తీసుకొచ్చారు. ఇదంతా కూడా శివ లీల అనిపించింది. అవుట్ పుట్ చూస్తే ఇదంతా శివయ్యే చేయించాడని అనిపిస్తుంది. అందరికీ సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను’ అని అన్నారు.