G. Kishan Reddy: సింగరేణి ప్రైవేటీకరణ అంశంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ
- సింగరేణిని ప్రైవేటీకరించేది లేదన్న కేంద్రమంత్రి
- ఒడిశాలో తాము రాగానే మైనింగ్ కోసం అనుమతిచ్చామని వెల్లడి
- బడ్జెట్ ప్రసంగంలో అన్ని రాష్ట్రాల పేర్లు చెప్పలేమన్న నిర్మలా సీతారామన్
సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించేది లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ సింగరేణిని కాపాడాలని, ప్రైవేటీకరించవద్దని లోక్ సభలో కోరారు. ఈ అంశంపై కిషన్ రెడ్డి స్పందిస్తూ... సింగరేణి రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉందన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించేది లేదని... తమ లక్ష్యంలో కూడా అది లేదన్నారు.
సింగరేణికి పదేళ్ల నుంచి ఎలాంటి మైనింగ్ ఇవ్వలేదని, కానీ ఒడిశాలో తమ బీజేపీ ప్రభుత్వం రాగానే మైనింగ్ కోసం అనుమతులు మంజూరు చేశామని గుర్తు చేశారు. సింగరేణిపై నరేంద్రమోదీ ప్రభుత్వానికి కమిట్‌మెంట్ ఉందన్నారు.
అన్ని రాష్ట్రాల పేర్లు చెప్పలేం కదా: నిర్మలా సీతారామన్
కేంద్ర బడ్జెట్‌లో కొన్ని రాష్ట్రాలపై వివక్ష చూపించారంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. బడ్జెట్ ప్రసంగంలో అన్ని రాష్ట్రాల పేర్లు చెప్పలేం కదా అన్నారు.