WhatsApp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్!

WhatsApp introducing A new way to share files without the internet
  • ఇంటర్నెట్ లేకుండానే ఫైల్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకునే ఛాన్స్
  • రెండు డివైజ్‌లను అనుసంధానించుకుని ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశం
  • ఆరంభంలో ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి
మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’కు ప్రపంచవ్యాప్తంగా ఎనలేని ఆదరణ ఉంది. ఇక యూజర్ల అనుభూతిని మెరుగుపరచేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చే వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేయబోతోంది. ఈ ఫీచర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్‌ లేకుండానే ఫోటోలు, వీడియోలు, ఇతర డాక్యుమెంట్ ఫైల్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేసేందుకు యూజర్లకు అవకాశం ఏర్పడనుంది.

ఇంటర్నెట్ కనెక్షన్‌ అవసరం లేకుండానే రెండు పరికరాల (డివైజ్‌ల) మధ్య ఈ ఫైల్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఈ మేరకు సరికొత్త ఫీచర్‌ను వాట్సాప్ డెవలప్‌ చేస్తోందని ‘వాట్సాప్‌బేటా ఇన్ఫో’ రిపోర్ట్ పేర్కొంది. పెద్ద ఫైల్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేసేందుకు గతంలో థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధారపడిన వారికి సరికొత్త ఫీచర్ ప్రయోజనకరమని తెలిపింది. భారీ ఫైల్స్‌ను సులభంగా షేర్ చేయడానికి వీలుంటుందని పేర్కొంది. 

కొత్త ఫీచర్‌లో స్కానర్ ఉంటుంది. ఈ స్కానర్ సాయంతో రెండు పరికరాలను అనుసంధానించాల్సి ఉంటుంది. తద్వారా సులభంగా ఫైల్స్ షేరింగ్‌ చేసుకోవచ్చు. కొత్త ఫీచర్ యూజర్ ప్రైవసీకి భరోసాను ఇస్తుందని పేర్కొంది. ఈ కొత్త ఫీచర్ ప్రారంభంలో ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఐవోఎస్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురావాలని వాట్సాప్ భావిస్తోంది.
WhatsApp
WhatsApp New Feature
File Sharing

More Telugu News