CM Ramesh: ఏపీలో విడుదల చేస్తున్న శ్వేతపత్రాల్లోని అంశాలపై విచారణ జరిపించాలి: సీఎం రమేశ్
- కేంద్ర బడ్జెట్ పై నేడు లోక్ సభలో ప్రసంగించిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్
- బడ్జెట్ లో కేటాయింపులు చేసి ఏపీకి ఆక్సిజన్ అందించారని వెల్లడి
- జగన్ ఒక్క చాన్స్ ఇస్తే రాష్ట్రం మొత్తం దోచేశారని విమర్శలు
- ఏపీలో జరిగినట్టు మరే రాష్ట్రంలో జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ నేడు కేంద్ర బడ్జెట్ పై లోక్ సభలో ప్రసంగించారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు చేసి ఆక్సిజన్ అందించారని కొనియాడారు. జగన్ కు ఒకసారి అవకాశం ఇస్తే రాష్ట్రం మొత్తం దోచేశారని... ల్యాండ్, శాండ్, మైనింగ్, లిక్కర్ లో దోపిడీ చేశారని విమర్శించారు.
ఒక ఆర్థిక ఉగ్రవాది సీఎం అయితే రాష్ట్రం ఎలా నష్టపోతుందో చూశామని సీఎం రమేశ్ పేర్కొన్నారు. జగన్ దోపిడీకి సహకరించిన అధికారులపై కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీలో జరిగినట్టు మరే రాష్ట్రంలోనూ జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏపీలో విడుదల చేస్తున్న శ్వేతపత్రాల్లోని అంశాలపై విచారణ జరిపించాలని సీఎం రమేశ్ డిమాండ్ చేశారు.