Suryakumar Yadav: పాండ్యాను కాదని సూర్యకు టీ20 పగ్గాలు అప్పగించడాన్ని సమర్థించిన టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్

Ex India Coach On Suryakumar Yadav Becoming T20I Captain

  • అజిత్ అగార్కర్ నిర్ణయాన్ని స్వాగతించిన పరాస్ మాంబ్రే
  • టీ20 ఫార్మాట్‌లో సూర్య అత్యుత్తమ ఆటగాడని ప్రశంస
  • డ్రెస్సింగ్ రూములోనూ కలుపుగోలుగా ఉంటాడన్న మాంబ్రే

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను కాదని స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌‌కు టీ20 పగ్గాలు అప్పగించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రోహిత్ శర్మ గైర్హాజరీలో కొన్నేళ్లపాటు టీ20లకు పాండ్యా నాయకత్వం వహించాడు. జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. అలాంటిది అతడిని కాదని శ్రీలంక టూర్‌లో సూర్యకు టీ20 పగ్గాలు అప్పగించడం అందిరినీ షాక్‌కు గురిచేసింది. ఫిట్‌నెస్ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే పాండ్యాను కాకుండా సూర్యకు పగ్గాలు అప్పగించినట్టు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. 

సూర్యకు టీ20 జట్టు పగ్గాలు అప్పగించడంపై టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే సమర్థించాడు. సూర్యను కెప్టెన్‌గా ఎంపిక చేయడం వెనకున్న కారణాన్ని కూడా వెల్లడించాడు. టీ20 ఫార్మాట్‌లో సూర్య అత్యుత్తమ ఆటగాడని, జట్టుకు విజయాలు అందించిపెట్టగలడని పేర్కొన్నాడు. ప్రస్తుతం టీ20ల్లో సూర్య, సౌతాఫ్రికా ఆటగాడు హెన్రిక్ క్లాసెన్ ఇద్దరే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నారని చెప్పుకొచ్చాడు. అసాధారణ నైపుణ్యం కలిగిన సూర్య దేశం కోసం జట్టుకు విజయాలు అందించిపెట్టగలడని పేర్కొన్నాడు. డ్రెస్సింగ్ రూములోనూ సూర్యకుమార్ కలుపుగోలుగా ఉంటాడని మాంబ్రే చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News