Manu Baker: ఇది హిస్టారికల్ మెడల్... పారిస్ ఒలింపిక్స్ లో మను బాకర్ ఘనతపై ప్రధాని మోదీ స్పందన
- పారిస్ ఒలింపిక్స్ లో భారత్ బోణీ
- 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ అంశంలో మను బాకర్ కు కాంస్యం
- అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం లభించింది. అది కూడా చరిత్రలో నిలిచిపోయేలా పతకం దక్కింది. మహిళా షూటర్ మను బాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ అంశంలో కాంస్యం సాధించింది. ఇప్పటివరకు ఒలింపిక్ మహిళల షూటింగ్ అంశంలో భారత్ కు లభించిన తొలి పతకం ఇదే. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మను బాకర్ సాధించిన కాంస్యం చారిత్రాత్మకమైన పతకం అని అభివర్ణించారు.
"పారిస్ ఒలింపిక్స్ లో మొట్టమొదటి పతకం అందించావు... వెల్ డన్ మను బాకర్. కాంస్యం గెలిచినందుకు కంగ్రాచ్యులేషన్స్. ఈ పతకం ఎంతో ప్రత్యేకం... ఎందుకంటే ఒలింపిక్స్ లో ఇప్పటివరకు భారత్ కు షూటింగ్ కేటగిరిలో పతకం అందించిన తొలి మహిళగా మను బాకర్ అవతరించింది... నిజంగా ఇది అద్భుతమైన ఘనత" అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.