Sivam Bhaje: సెన్సార్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన 'శివం భజే'

Sivam Bhaje movie completes censor work and ready to release
  • అశ్విన్ హీరోగా శివం భజే
  • అప్సర్ దర్శకత్వంలో చిత్రం
  • U/A సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు
  • ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు వస్తున్న శివం భజే చిత్రం
యువ హీరో అశ్విన్ ప్రధాన పాత్రలో అప్సర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం శివం భజే. గంగా ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ మంజూరు చేసింది. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 6 నిమిషాలు. 

న్యూ ఏజ్ కథ, కథనాలతో రూపుదిద్దుకున్న శివం భజే చిత్రం ఆగస్టు 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా పాటలు, ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి విశేష స్పందన లభించింది. శివం భజే చిత్రానికి వికాస్ బడిస నేపథ్య సంగీతం అందించారు. 

ఇందులో అర్బాజ్ ఖాన్, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, షకలక శంకర్, కాశీవిశ్వనా, ఇనాయా సుల్తానా తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
Sivam Bhaje
Aswin
Censor
U/A
Ganga Entertainments
Apsar
Tollywood

More Telugu News