Chandrababu: పాస్ పుస్తకాలపై తన బొమ్మ వేసుకున్న గత పాలకుడి తప్పులను సరిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు

CM Chandrababu tweets on new pattadar pass book
  • నేడు రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై చంద్రబాబు సమీక్ష
  • రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాలను పరిశీలించిన చంద్రబాబు
  • ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలుపుకుంటున్నామంటూ ట్వీట్
ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా పాల్గొన్నారు. త్వరలో ప్రజలకు అందించబోయే రాజముద్రతో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను ఈ సమీక్షలో చంద్రబాబు పరిశీలించారు. 

ఈ సమావేశంపై చంద్రబాబు ట్వీట్ చేశారు. "పట్టాదారు పాస్ పుస్తకాలపై తన బొమ్మ వేసుకుని తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడిన గత పాలకుడి తప్పులను సరిదిద్దుతున్నాం" అని వెల్లడించారు. 

తాత, తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులపై ఎవరి బొమ్మా ఉండకూడదన్నది ప్రజా అభిప్రాయం అని చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.

నాటి అహంకార పూరిత, పెత్తందారీ పోకడలు ఈ ప్రజా ప్రభుత్వంలో ఉండవని స్పష్టం చేశారు. ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడి, వారి ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు తన ట్వీట్ లో వివరించారు.
Chandrababu
Pattadar Pass Book
TDP-JanaSena-BJP Alliance
Jagan
YSRCP

More Telugu News