Gaddam Prasad Kumar: నిన్న తెల్లవారుజాము 3.15 వరకు అసెంబ్లీ జరిగింది... సుదీర్ఘ ప్రసంగాలు వద్దు: స్పీకర్ ప్రసాద్ కుమార్
- నిన్న ఉదయం 10 గంటలకు ప్రారంభమై తెల్లవారుజాము వరకు సాగిందన్న స్పీకర్
- పూర్తిగా సబ్జెక్ట్ పైనే మాట్లాడాలని విజ్ఞప్తి
- స్కిల్స్ యూనివర్సిటీ బిల్లు ప్రవేశపెట్టిన శ్రీధర్ బాబు
సభ్యులు సుదీర్ఘ ప్రసంగాలు చేయవద్దని తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం శాసన సభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ... అసెంబ్లీ సమావేశాలు నిన్న ఉదయం 10 గంటలకు ప్రారంభమై... తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాల వరకు జరిగాయని తెలిపారు. అందుకే నిన్నటిలా సుదీర్ఘ ప్రసంగాలు వద్దని సభ్యులను కోరారు. పూర్తిగా సబ్జెక్ట్ పైన మాట్లాడాలని వారికి విజ్ఞప్తి చేశారు.
స్కిల్స్ యూనివర్సిటీ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు
మంత్రి శ్రీధర్ బాబు స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టారు. మరో 19 పద్దులపై శాసన సభలో చర్చ జరుగుతోంది. వ్యవసాయం, సహకార, నీటిపారుదల, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, గృహ నిర్మాణం, పౌరసరఫరాలు, పశుసంవర్ధక శాఖ, పర్యాటక, క్రీడా, అటవీ, దేవాదాయ, మైనార్టీ, చేనేత, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల పద్దులపై చర్చిస్తున్నారు.