Actress Meena: యూట్యూబ్ చానళ్లపై మంచు విష్ణు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించిన మీనా

Actress Meena Praised Manchu Vishnu Decision To Ban YouTube Channels
  • నటీనటులపై ఫేక్ వార్తలు ప్రసారం చేస్తున్న యూట్యూబ్ చానళ్లపై ఇటీవల మంచు విష్ణు ఫైర్
  • 18 చానళ్లపై ఫిర్యాదు చేసి రద్దు చేయించిన మంచు విష్ణు
  • మంచు విష్ణుకు, ‘మా’కు థ్యాంక్స్ చెప్పిన మీనా
నటీనటులను విమర్శిస్తూ అసత్య వార్తలను వండివారుస్తున్న యూట్యూబ్ చానళ్లపై ఫిర్యాదు చేసిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఇటీవల 18 చానళ్లను రద్దు చేయించింది. మా అధ్యక్షుడు మంచు విష్ణు తీసుకున్న ఈ నిర్ణయాన్ని నటి మీనా ప్రశంసించారు. ఆయనకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా థ్యాంక్స్ చెప్పారు.

తప్పుడు కంటెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళుతున్న యూట్యూబ్ చానళ్లపై చర్యలు తీసుకున్న ‘మా’కు, అధ్యక్షుడు మంచు విష్ణుకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నట్టు ఆ పోస్టులో మీనా పేర్కొన్నారు. ఇండస్ట్రీ సమగ్రతను విష్ణు కాపాడుతున్నారని, ఆయన అంకితభావం అభినందనీయమని ప్రశంసించారు. నెగటివ్ కామెంట్స్‌ను నిరోధించడంతోపాటు సంఘాన్ని కాపాడడంలో అందరం కలిసి ముందుకెళ్లాలని పేర్కొన్నారు. విష్ణు చాలా మంచి పని చేశారని కొనియాడారు.
Actress Meena
Manchu Vishnu
MAA
Tollywood
YouTube Channels

More Telugu News