KTR: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు... స్పందించిన కేటీఆర్
- ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ చిత్తశుద్ధితో కృషి చేసిందన్న కేటీఆర్
- వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేశామని వెల్లడి
- ఈ అంశంపై మిగతా రాజకీయ పార్టీలు రాజకీయం చేశాయని విమర్శ
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ చిత్తశుద్ధితో కృషి చేసిందన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తాము అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. వర్గీకరణకు మద్దతుగా తమ పార్టీ అధినేత కేసీఆర్ కూడా ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారని గుర్తు చేశారు. ఈ అంశంపై మిగతా రాజకీయ పార్టీలు మాత్రం ఓట్ల రాజకీయం చేశాయని ఆరోపించారు.
ఎస్సీ వర్గీకరణను స్వాగతించిన బీజేపీ
ఎస్సీ వర్గీకరణ తీర్పును తెలంగాణ బీజేపీ స్వాగతించింది. ఈ మేరకు ఆ పార్టీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు ప్రధాని నరేంద్రమోదీ సంపూర్ణంగా సహకరించారన్నారు. వర్గీకరణ ప్రక్రియకు బీజేపీ సంపూర్ణ మద్దతును ప్రకటించిందన్నారు.