Angela Carini: పారిస్ ఒలింపిక్స్ లో అనూహ్య వివాదం... పురుష బాక్సర్ తో తలపడనంటూ వాకౌట్ చేసిన మహిళా బాక్సర్

Italy boxer Angela Carini abandoned bout with Imane Khelif of Algeira
పారిస్ ఒలింపిక్స్ లో ఎవరూ ఊహించని రీతిలో వివాదం చోటుచేసుకుంది. ఓ పురుష బాక్సర్ తో తాను తలపడనంటూ ఓ మహిళా బాక్సర్ పోటీ నుంచి వైదొలగింది. అసలేం జరిగిందంటే... మహిళల 66 కేజీల విభాగంలో ఇటలీకి చెందిన ఏంజెలా కారిని, అల్జీరియాకు చెందిన ఇమానే ఖెలిఫ్ తో తలపడింది. 

అయితే, బౌట్ ప్రారంభమైన 46 సెకన్లకే ఇటలీ బాక్సర్ కారిని వాకౌట్ చేసింది. ఆమె పోటీ నుంచి తప్పుకోవడానికి బలమైన కారణమే ఉంది. మహిళల కేటగిరీలో బరిలో దిగిన ఇమానే ఖెలిఫ్ శారీరకంగా పురుషుడు అనే ఆరోపణ ఉంది. గతేడాది జరిగిన లింగ నిర్ధారణ పరీక్షలో తన స్త్రీత్వాన్ని నిరూపించుకోవడంలో ఖెలిఫ్ విఫలం కావడం మీడియాలో ప్రముఖంగా ప్రసారమైంది. 

ఇవాళ పోటీ ప్రారంభమైన కాసేపటికే ఖెలిఫ్ బలమైన పంచ్ లు విసరడంతో ఏంజెలా కారిని ముక్కుకు గాయయైంది. ఓ పురుష బాక్సర్ తో తలపడడం ప్రమాదకరమని భావించి తాను తప్పుకున్నానని బౌట్ అనంతరం ఇటలీ అమ్మాయి కారిని వెల్లడించింది. 

కాగా, కారిని పోటీ మధ్యలోనే తప్పుకోవడంతో నిబంధనల ప్రకారం ఇమానే ఖెలిఫ్ ను విజేతగా ప్రకటించారు. దాంతో కారిని తన కల భగ్నమైందంటూ కన్నీటిపర్యంతమైంది.
Angela Carini
Imane Khelif
Boxing
Paris Olympics

More Telugu News