TTD: జులైలో 22 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు: టీటీడీ ఈఓ శ్యామలరావు

TTD EO Shyamala Rao on Dial Your EO Program

  • తిరుమల అన్నమయ్య భవనంలో 'డయల్ యువర్ ఈఓ' కార్యక్రమం
  • టీటీడీ అన్నప్రసాదాల్లో నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించిన‌ట్లు వెల్ల‌డి
  • దళారీ వ్యవస్థ నిర్మూల‌న‌కు ప్రత్యేక చర్యలు చేపట్టామన్న టీటీడీ ఈఓ  

తిరుమల అన్నమయ్య భవన్ లో టీటీడీ ఈఓ శ్యామ‌ల‌రావు 'డయల్ యువర్ ఈఓ' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... జులైలో 22 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవాణి ద‌ర్శ‌న టికెట్లు పరిమితం చేసిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. 
 
ఇంకా ఈఓ మాట్లాడుతూ... తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అన్నప్రసాదాల్లో నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించిన‌ట్లు తెలిపారు. దళారీ వ్యవస్థ నిర్మూల‌న‌కు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. కాగా, ఇప్ప‌టికే నాసిర‌కం నెయ్యి స‌ర‌ఫ‌రా చేస్తున్న కాంట్రాక్ట‌ర్‌ను టీటీడీ బ్లాక్ లిస్టులో పెట్టింది. 

ఇక తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని ఆధునికీకరించాలని నిర్ణయించినట్లు చెప్పిన ఈఓ శ్యామ‌ల‌రావు... ఆ మేర‌కు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇదిలాఉంటే... గత ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో భక్తుల నుంచి వచ్చిన విమర్శలు పునరావృతం కాకుండా పూర్తిస్థాయి ప్రక్షాళనకు టీటీడీ కార్యాచరణ సిద్ధం చేసింద‌ని ఈఓ శ్యామలరావు ఇటీవలే చెప్పారు.

  • Loading...

More Telugu News