Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ఒకే మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీల రికార్డులు బద్దలు

Rohit Sharma has created history by shattering a long time record held by Sachin Tendulkar
భారత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్ కొనసాగుతోంది. శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన వన్డేలో కూడా వరుసగా రెండవ అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. దీంతో ఎన్నో ఏళ్లుగా సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును హిట్‌మ్యాన్ బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత ఓపెనర్లలో అత్యధికంగా 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఆదివారం సాధించిన 64 స్కోర్‌తో ఓపెనర్‌గా రోహిత్ 50 ప్లస్ స్కోర్ల సంఖ్య 121కి చేరింది. 120 సార్లు 50కిపైగా స్కోర్లు సాధించిన సచిన్‌ను హిట్‌మ్యాన్ అధిగమించాడు.

ఇక అంతర్జాతీయంగా చూస్తే ఈ జాబితాలో రోహిత్ శర్మ 6వ స్థానంలో నిలిచాడు. 146 ఫిఫ్టీ ప్లస్ స్కోర్లతో డేవిడ్ వార్నర్ అగ్రస్థానంలో నిలిచాడు. 144 స్కోర్లతో రెండో స్థానంలో క్రిస్ గేల్, 136 స్కోర్లతో సనత్ జయసూర్య 3వ స్థానంలో, 131 స్కోర్లతో డెస్మండ్ హేన్స్ 4వ స్థానంలో, 125 స్కోర్లతో గ్రేమ్ స్మిత్ 5వ స్థానంలో ఉన్నారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాళ్లు 
1. డేవిడ్ వార్నర్ - 146 (374 మ్యాచ్‌లు)
2. క్రిస్ గేల్ - 144 (441 మ్యాచ్‌లు)
3. సనత్ జయసూర్య - 136 (: 506 మ్యాచ్‌లు)
4. డెస్మండ్ హేన్స్ - 131 ( 354 మ్యాచ్‌లు)
5. గ్రేమ్ స్మిత్ - 125 (342 మ్యాచ్‌లు)
6. రోహిత్ శర్మ - 121 (334 మ్యాచ్‌లు)

ధోనీ రికార్డు కూడా బ్రేక్..
రోహిత్ శర్మ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని హిట్‌మ్యాన్ అధిగమించాడు. ధోనీ మొత్తం 10,773 సాధించగా శ్రీలంకతో రెండో వన్డేలో సాధించిన 64 పరుగులతో కలుపుకొని రోహిత్ మొత్తం రన్స్ 10,831కు చేరాయి. దీంతో వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ 5వ స్థానానికి చేరగా.. ఎంఎస్ ధోనీ 6వ స్థానానికి పడిపోయాడు. వీరి కంటే ముందు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్‌ వరుస స్థానాల్లో ఉన్నారు.

Rohit Sharma
Sachin Tendulkar
India vs Sri Lanka
Cricket

More Telugu News