Hiccups: ఎక్కిళ్ల వెనకున్న అసలు కారణం ఏంటో మీకు తెలుసా?
కొంతమంది ఆహారం తింటున్నప్పుడు లేదా నవ్వుతున్నప్పుడు అకస్మాత్తుగా ఎక్కిళ్లు వస్తుంటాయి. ఆల్కహాల్ తాగే వారికి కూడా అప్పుడప్పుడు ఈ పరిస్థితి ఎదురవుతుంటుంది. కొన్నిసార్లు ఎలాంటి కారణం లేకుండానే వెక్కిళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. నీళ్లు తాగినప్పటికీ అవి తగ్గవు. దాంతో ఎక్కిళ్లను తగ్గించుకునేందుకు ఎవరికి తెలిసిన చిట్కాలను వారు పాటిస్తుంటారు. ఎంతకీ తగ్గక కొందరు భయపడుతుంటారు కూడా. ఎక్కిళ్లతో బాగా ఇబ్బంది పడి హాస్పిటల్స్‌లో చేరినవారు కూడా చాలామందే ఉన్నారు.
మరి ఇంతకీ ఎక్కిళ్లు ఎందుకు వస్తాయి? కారణం ఏంటి? శ్వాస ప్రక్రియలో కీలకంగా వ్యవహరించే డయాఫ్రమ్ కండరానికి, ఎక్కిళ్లకు మధ్య సంబంధం ఏంటి? స్వరపేటిక అకస్మాత్తుగా మూసుకుపోయి ‘హిక్' అనే శబ్దం రావడానికి కారణం ఏంటి? అని మీకు ఎప్పుడైనా సందేహాలు వచ్చాయా? ఏపీ7ఏఎం రూపొందించిన ఈ వీడియో చూస్తే మీ సందేహానికి సమాధానం దొరుకుతుంది. మరెందుకు ఆలస్యం వీడియోను పూర్తిగా వీక్షించండి.